తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs NZ 2021: అశ్విన్ పొరపాటు.. మయాంక్ సరికొత్త రికార్డు - మయాంక్ అగర్వాల్ 150 స్కోర్

IND vs NZ 2021: భారత్-న్యూజిలాండ్​ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఓ వింత సన్నివేశం చోటు చేసుకుంది. అజాజ్ పటేల్ బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాక అశ్విన్ డీఆర్​ఎస్ కోరడం ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. అలాగే ఈ మ్యాచ్​లో మయాంక్ ఓ రికార్డు నెలకొల్పాడు.

Ashwin
Ashwin

By

Published : Dec 4, 2021, 1:01 PM IST

Updated : Dec 4, 2021, 2:06 PM IST

Ravi Ashwin Review: భారత్-న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో రెండు రోజు బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాను వరుస వికెట్లు తీసి దెబ్బతీశాడు స్పిన్నర్ అజాజ్ పటేల్. ఈ క్రమంలోనే అశ్విన్​ను 6వ వికెట్​గా పెవిలియన్ పంపాడు. అజాజ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్ క్లీన్ బౌల్డయ్యాడు. కానీ అది అతడు చూసుకోలేదు. అంపైర్ ఔట్ అని చెప్పగానే.. డీఆర్ఎస్ కోరాడు. తర్వాత వెనక్కు చూసి తన తప్పు తెలుసుకుని పెవిలియన్ బాట పట్టాడు. ఇది చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్​గా మారడం వల్ల.. 'అయ్యో అశ్విన్ కనీసం చూసుకోలేవా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Mayank Agarwal Record: ఈ మ్యాచ్​లో 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్​లో మూడు 150+ స్కోర్ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. కోహ్లీ ఒకసారి 150+ స్కోర్ నమోదు చేశాడు. రూట్ నాలుగు 150+ స్కోర్స్​తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవీ చూడండి: IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ వాయిదా

Last Updated : Dec 4, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details