మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. ఇక చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని ఎదురు చూస్తోంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో అదరగొట్టి.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌కు చుక్కులు చూపించింది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయం సాధిస్తే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న భారత్.. అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌తో కెప్టెన్ కోహ్లీ, రోహిత్ అరుదైన ఘనతలను అందుకోనున్నారు.
- ఓపెనర్‌గా రోహిత్ 10 ఏళ్లను పూర్తి చేసుకోనున్నాడు.
- అదే విధంగా వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ జట్టును క్లీన్‌స్వీప్ చేసే అవకాశం భారత్‌కు వచ్చింది.
- ఇక కోహ్లీ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. అయితే అది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ రికార్డు కావడం విశేషం.
- ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే.. న్యూజిలాండ్‌పై ఎక్కువ హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
- ప్రస్తుతం విరాట్, సచిన్ పదమూడేసి అర్ధశతకాలతో ఉన్నారు. సెంచరీ సాధిస్తే మాత్రం కివీస్‌పై ఎక్కువ శతకాలు సాధించిన బ్యాటర్‌గానూ వీరేంద్ర సెహ్వాగ్ (6)తో సమంగా విరాట్ కోహ్లీ (5) నిలుస్తాడు.