టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు క్యాచ్‌లు పట్టగా.. అందులో రెండు హైలైట్‌గా నిలిచాయి. ఇందులో విశేషమేమిటంటే సూర్య తీసుకున్న రెండు క్యాచ్‌లు ఒకే స్టైల్‌లో ఉండడం. ఈ రెండు క్యాచ్‌లు పక్కపక్కనబెట్టి చూస్తే రిప్లే చూసినట్లుగా అనిపించడం విశేషం. అవి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే అతడిని ముద్దుగ్గా స్కై అని పిలుస్తుంటారు. అతను గాల్లోకి ఎగిరి రెండు క్యాచ్‌లు పట్టడం చూసిన నెటిజన్లు.. 'నిన్ను స్కై అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపించుకున్నావ్' అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో సూర్య 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.
భలే కూల్ చేశారుగా.. ఇకపోతే ఈ సిరీస్‌లో అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది పృథ్వీ షాకు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను ఆడించారే తప్ప ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పృథ్వీ షాకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. కనీసం మూడో టి20లోనైనా పృథ్వీని ఆడిస్తారనుకుంటే అదీ జరగలేదు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు వచ్చాయి.