న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. ఇందులో భాగంగా(ind vs nz t20 series 20210) మరికాసేపట్లో(నవంబరు 17) తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్ నుంచే టీ20ల్లో టీమ్ఇండియాకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా(rohithsharma captaincy) వ్యవహరించనున్నాడు. ఇక కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. రవిశాస్త్రి పదవీకాలం ముగియడం వల్ల అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఇటీవలే ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవ్వగా.. తాత్కాలిక సారథిగా టిమ్ సౌథీ నియమితుడయ్యాడు. ఈ పోరులో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
జట్లు