తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS NZ: కివీస్​తో తొలి టీ20కి మన కుర్రాళ్లు రెడీ.. ఓపెనింగ్​కు ఆ ఇద్దరిలో ఎవరో? - teamindia vs Newzealand live score

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్​ఇండియా ఇకపై ఆ జట్టుతో టీ20ల్లో తలపడనుంది. ఈనెల మెుదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న భారత్‌ కివీస్‌పైనా అదేజోరు కొనసాగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో క్రమంగా సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్న యాజమాన్యం కుర్రాళ్లకు వీలైనంత ఎక్కువగా అవకాశాలిస్తోంది. అటు వన్డే సిరీస్‌ చేజార్చుకున్న పర్యాటక కివీస్ 20 ఓవర్ల ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలని యోచిస్తోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం తొలి టీ20 జరగనుంది.

IND VS NZ first T20
IND VS NZ first T20

By

Published : Jan 26, 2023, 10:50 PM IST

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్​ఇండియా ఇకపై ఆ జట్టుతో టీ20ల్లో తలపడనుంది. ఈనెల మెుదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న భారత్‌ కివీస్‌పైనా అదేజోరు కొనసాగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో క్రమంగా సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్న యాజమాన్యం కుర్రాళ్లకు వీలైనంత ఎక్కువగా అవకాశాలిస్తోంది. అటు వన్డే సిరీస్‌ చేజార్చుకున్న పర్యాటక కివీస్ 20 ఓవర్ల ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలని యోచిస్తోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం తొలి టీ20 జరగనుంది.

ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టీ 20 సిరీస్‌లతోపాటు తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌.. కివీస్‌తో 3 టీ-ట్వంటీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. వచ్చే పొట్టి ప్రపంచకప్‌ నాటికి కుర్రాళ్లతో కూడిన జట్టును సిద్ధంచేయాలని యోచిస్తున్న బీసీసీఐ అందుకు తగ్గట్టుగా కొత్తవారిని ప్రోత్సహిస్తోంది. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్​ రాహుల్‌ సహా పలువురు బౌలర్లకు విశ్రాంతి పేరుతో 20ఓవర్ల ఫార్మాట్‌ నుంచి తప్పించింది. కుర్రాళ్లకు అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే ఈనెలలో హార్దిక్​ నేతృత్వంలోని కుర్రాళ్లు.. శ్రీలంకతో సిరీస్‌ను చేజిక్కించుకుని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సీనియర్ల గైర్హాజరీతో.. దేశవాళీల్లో మ్యాచ్‌ల్లో శతక్కొడుతున్న ఓపెనర్ పృథ్వీ షాకు చాలాకాలం తర్వాత జట్టులోకి స్థానం దొరికింది. వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌కుతోడుగా లెఫ్టాండర్ ఇషాన్‌ కిషన్‌ లేదా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోస్థానం కోసం భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.

బౌలర్ల విషయానికి వస్తే సీనియర్‌ పేసర్ షమీతోపాటు ఇటీవల అద్భుతంగా రాణించిన సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చారు. లంకతో సిరీస్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న అర్ష్‌దీప్‌ సింగ్ ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది. మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లోనే 4వికెట్లు తీసిన శివంమావి స్పీడ్‌స్టర్‌ ఉమ్రన్ మాలిక్‌తో జోడీగా తుది జట్టులో చోటుదక్కించుకోనున్నాడు. ఇక అక్షర్‌ పటేల్‌ గైర్హాజరీలో కుల్దీప్‌-చాహల్‌ ద్వయంలో చాహల్ వైపే జట్టు యాజమాన్యం మెుగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.

వన్డే సిరీస్‌ చేజార్చుకున్న కివీస్ జట్టు.. కనీసం టీ-20 సిరీస్‌ గెలిచి స్వదేశంలో అడుగుపెట్టాలని భావిస్తోంది. వన్డే సిరీస్‌లో బంతితోపాటు బ్యాటుతో అద్భుతంగా రాణించిన మిచెల్ శాంట్నర్ టీ-20ల్లో కివీస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. చివరి వన్డేలో మెరుపు సెంచరీ సాధించిన లెఫ్టాండర్ డెవోన్ కాన్వే, ఉప్పల్‌ వన్డేలో శతకం సాధించిన మిచెల్ బ్రాస్‌ వెల్‌లపైనే ఆ జట్టు బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. రాంచీ వేదికగా తొలి టీ-20 మ్యాచ్‌ శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:క్రికెట్​ చరిత్రలో రేర్ ఇన్సిడెంట్​.. ఏకంగా 9 మందితో బౌలింగ్​ ఎటాక్​

ABOUT THE AUTHOR

...view details