IND Vs IRE T20 :ఇప్పటివరకు విండీస్ టూర్లో ఉన్న టీమ్ఇండియా.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ సత్తా చాటేందుకు దూకుడుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. ఈ క్రమంలో పలువురు యంగ్ ప్లేయర్స్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా దాదాపు 11 నెలలుగా మైదానంలోకి అడుగుపెట్టని బుమ్రా ఈ సిరీస్‌లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ సారి టీమ్‌లో యంగ్ ప్లేయర్సే ఎక్కువ ఉండటం వల్ల.. స్టార్ల కొరతే సిరీస్‌కు వెలతిగా మారింది.
ఇటీవల వెస్టిండీస్‌తో ఆడిన జట్టులో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయినా ఉన్నాడు. అతను ఈ సిరీస్‌కు తను కూడా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, జితేశ్ శర్మలు ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలవనున్నారు. వీరందరూ ఐపీఎల్‌లో సత్తా చాటినందను బుమ్రా వీరిపై భరోసా పెట్టుకోవచ్చు.
ఆ ఇద్దరు..
Bumrah Ireland Series :గాయం కారణంగా గత కొంత కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. పరిమిత ఓవర్లలో పవర్‌ఫుల్ బౌలర్‌గా రాణించిన బుమ్రా.. ఈ సిరీస్‌లో ఎలా ఆడనున్నాడో అంటూ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక బుమ్రా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న బీసీసీఐ.. అతన్ని వన్డేల్లో కాకుండా టీ20 మ్యాచ్‌లతో ఆడించి అతనిపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌తో పాటు విండీస్ సిరీస్‌లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మను ఐర్లాండ్ సిరీస్‌కు ఎంచుకుంది. ఈ క్రమంలో ఇతని ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.