IND vs ENG World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 29) భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు లఖ్‌నవూ స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుత మెగాటోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమ్ఇండియా. మరోవైపు ఇంగ్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవడం అటుంచితే, కనీసం సెమీస్‌కు వచ్చే ఛాన్స్‌లు కూడా దూరం చేసుకుంటోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు మరింత చేరువ కావాలని భారత్ ఉవ్విళ్లూరుతుంటే.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత అయినా గెలుపు బాట పట్టాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
టీమ్ఇండియా ఎలా ఉందంటే?
కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్ఠంగా ఉంది. శుభ్‌మన్ గిల్, రోహిత్, విరాట్ కోహ్లీతో టాప్ఆర్డర్ బలంగా ఉంటే.. శ్రేయస్ అయ్యర్, రాహుల్‌తో మిడిలార్డర్ దృఢంగా ఉంది. ఇప్పటివరకూ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఈ ఐదుగురే జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. తొలి మ్యాచ్ మినహా.. భారత్‌కు రోహిత్, గిల్ అన్ని మ్యాచ్‌ల్లో శుభారంభాలు ఇచ్చారు.
ఇక హార్దిక్ గైర్హాజరీలో గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. దీంతో అతడికి మేనేజ్మెంట్ మరో ఛాన్స్ ఇవ్వవచ్చు. ఆల్‌రౌండర్ జడేజా, సూర్యతో నెంబర్ 6,7 స్థానాల్లో కూడా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంది. ఇక మెయిన్ బౌలర్లుగా కుల్దీప్, బుమ్రా జట్టులో ప్లేస్ ఖాయం చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం షమీ, సిరాజ్, శార్దూల్ మధ్య పోటీ ఉంది.
అశ్విన్‌కు లైన్ క్లియర్!..లఖ్‌నవూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శార్దూల్ స్థానంలో అశ్విన్ తీసుకొని.. జడేజా, కుల్దీప్, అశ్విన్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిదే అవకాశం ఉంది.