టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో అసలు పోరుకు ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీసేన.. ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది ఇంగ్లీష్ జట్టు.
రాణించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. భారత్ లక్ష్యం 189 - భారత్-ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోవడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. బెయిర్‌స్టో (49), మొయిన్ అలీ (43) రాణించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించేందుకు కృషి చేశారు ఓపెనర్లు జాసన్ రాయ్ (17), బట్లర్(18). కానీ వీరిద్దరినీ పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపాడు షమీ. తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అనంతరం బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ గొప్పగా ఆడారు. భారత బౌలర్లను సమర్థవంతంగా కాచుకుంటూ పరుగులు సాధించారు. వీరి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతున్న క్రమంలో లివింగ్‌స్టోన్ (30)ను బౌల్డ్ చేశాడు షమీ. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయిర్‌స్టో (49)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. చివర్లో మొయిన్ అలీ (43) కాసేపు మెరవడం వల్ల వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది మోర్గాన్ సేన.
భారత బౌలర్లలో షమీ నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 40 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.