టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) టైటిల్ గెలుపే లక్ష్యంగా శ్రమిస్తోన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో అసలు పోరుకు ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్(ind vs eng warm up match)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
Ind vs Eng T20: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ - భారత్-ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ టాస్
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్(ind vs eng warm up match) ఆడుతోంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్
బలమైన ఇంగ్లాండ్ జట్టుపై గెలిచి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలని కోహ్లీసేన భావిస్తోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్ మ్యాచ్‌లను జట్టు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.