టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమ్ఇండియా. అందుకు తగ్గట్లే ఆరంభ వార్మప్ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. దుబాయ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి అసలు మ్యాచ్‌లకు ముందు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
ఇంగ్లాండ్ విధించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రాహుల్, ఇషాన్ కిషన్.. టీమ్ఇండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 51 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన కోహ్లీ (11) నిరాశ పర్చినా.. పంత్‌తో కలిసి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు కిషన్. 46 బంతుల్లో 70 పరుగులు చేసిన అనంతరం ఇతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు (మరో ఆటగాడికి బ్యాటింగ్ ఇచ్చేందుకు). అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) విఫలమయ్యాడు. చివర్లో పాండ్యా (12) మెరవడం వల్ల కోహ్లీసేన విజయం సాధించింది.