టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో అతడి ప్రదర్శన పట్ల నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మూడో రోజు ఆటలో అతడు ఏకంగా 13 నో బాల్స్ వేయడమే అందుకు కారణం.
మ్యాచ్ మొత్తం మీద టీమ్ఇండియా 17 నో బాల్స్ వేస్తే.. అందులో బుమ్రా వాటానే 13. ఇక అతడి చివరి ఓవర్(126వ)లోనే ఏకంగా 4 నో బాల్స్ విసిరాడు. వీటిపై కొందరు నెటిజన్లు ట్విట్టర్లో అసహనం వ్యక్తం చేస్తే.. మరికొందరు చమత్కారంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. జో రూట్‌కు స్ట్రైక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న అండర్సన్‌ను బౌన్సర్లతో బెదరగొట్టాడు. దీంతో బుమ్రాపై అతడెలా ప్రతీకారం తీర్చుకుంటాడా అని ఎదురుచూస్తున్నారు నెటిజన్లు.