kohli Siraj bowling: టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న అనుబంధం ప్రతిఒక్కరికీ తెలిసిందే. విరాట్ కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ అతడి సూచనలతో చాలాసార్లు వికెట్లు దక్కించుకున్నాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇదే సంఘటన జరిగింది. మ్యాచ్ ఆరంభంలోనే షమీ బౌలింగ్‌లో జేసన్ రాయ్ వరుస బౌండరీలు బాది టీమ్ఇండియాపై ఆధిపత్యం చెలాయించాడు.
కానీ మరుసటి ఓవర్లో సిరాజ్.. ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ బెయిర్ స్టోను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రూట్‌ను బోల్తా కొట్టించాడు. అయితే రూట్ ఔట్‌కు ముందు.. సిరాజ్ వద్దకు పరుగెత్తుకొచ్చిన కోహ్లీ.. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసురు ఫలితం ఉంటుందని చెప్పాడు. అలానే విరాట్ ఇచ్చిన అడ్వైస్తోనే సిరాజ్ బౌలింగ్ వేసి వికెట్ దక్కించుకున్నాడు. దీంతో వికెట్ పడగానే కోహ్లీ వైపు చూస్తూ.. చూశావా నీ వ్యూహం ఫలించింది అన్నట్లుగా సైగలు చేయడం, ఆ తర్వాత మాజీ కెప్టెన్ వచ్చి హగ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన అభిమానులు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేశారు. 'రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్‌లో సిరాజ్ బౌలింగ్', 'కెప్టెనేమో రోహిత్.. సలహా ఇచ్చింది కోహ్లీ.. పాటించింది సిరాజ్.. ఇదేదో బాగుంది' అంటూ కామెంట్స్ చేశారు.