లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 64 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అజింక్య రహానె (24*), ఛెతేశ్వర్ పుజారా (29*) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, సామ్ కరన్ ఒక వికెట్ తీసుకున్నారు.
IND vs ENG: నిలబడిన పుజారా- రహానె.. టీ విరామానికి 105/3 - ఇండియా vs ఇంగ్లాండ్ టీ బ్రేక్
లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం 78 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో రహానె, పుజారా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, సామ్ కరన్ ఒక వికెట్ తీశారు.
ఇండియా vs ఇంగ్లాండ్
56/3తో టీ విరామానికి వెళ్లిన కోహ్లీసేన రెండో సెషన్లో పూర్తిగా డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చింది. అనవసరపు షాట్లకు పాల్గొనకుండా సిసలైన టెస్టు బ్యాటింగ్‌ను బయటకు తీశారు రహానె- పుజారా ద్వయం. పరుగులు చేయడానికంటే బంతులు వృథా చేయడానికే వీరు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈ జోడీ 179 బంతుల్లో కేవలం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.