లార్డ్స్ టెస్టు నాలుగోరోజు భోజన విరామానికి టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. కెప్టెన్ రహానె (1*), పుజారా (3*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీ సేన.
టీమ్ఇండియా టపటప.. లంచ్ సమయానికి 56/3
లార్డ్స్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతున్నారు. అయినప్పటికీ మూడు వికెట్లు కోల్పోయారు.
నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది టీమ్ఇండియా. తొలి వికెట్‌కు ఈ జోడీ 18 పరుగులు నమోదు చేశాక.. మార్క్ వుడ్ ఈ జంటను విడదీశాడు. అనంతరం కొద్దిసేపటికే మరో ఓపెనర్ రోహిత్ కూడా అతడి బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. 20 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన సారథి కోహ్లీని సామ్ కరన్ వెనక్కి పంపాడు.
అంతకుముందు, నాలుగో రోజు ఆటను టీమ్ఇండియా మహిళ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గంటను కొట్టి ప్రారంభించింది. ప్రతి రోజు ఒక్కొక్కరు గంట కట్టి ఆటను ప్రారంభిస్తున్నారు. అంతకు ముందు మూడోరోజు ఫరూక్ ఇంజినీర్ ఆటను ప్రారంభించాడు.