లార్డ్స్ టెస్టు మూడో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రూట్ (89*),బెయిర్ స్టో (51*) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్ 2, షమి ఒక వికెట్ తీశారు.
రూట్, బెయిర్ స్టో హాఫ్ సెంచరీలు.. తొలి సెషన్ ఇంగ్లాండ్‌దే - లార్డ్స్ టెస్టు
లార్డ్స్ టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్ 216/3 పరుగులతో నిలిచింది. కెప్టెన్ రూట్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మూడోరోజు తొలి సెషన్లో టీమ్ఇండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
119/3 స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆచితూచి ఆడుతోంది. ఆట మొదలైన రెండో బంతికే ఫోర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు రూట్. అతనికి అండగా బెయిర్ స్టో ధాటిగా ఆడుతున్నాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యంతో ఉంది. తొలి సెషన్లో వికెట్ల కోసం టీమ్ఇండియా బౌలర్లు తంటాలు పడుతున్నారు. వికెట్ లేకుండానే తొలి సెషన్ పూర్తి చేసి, లంచ్‌కు వెళ్లారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రాణించగా, రోహిత్(83) హాఫ్ సెంచరీతో మెరిశాడు.