ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీసేన 298/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
INDvsENG: భారత్ 298/8 డిక్లేర్డ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 272 - మహ్మద్ షమీ
18:25 August 16
సోమవారం 181/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలిసెషన్‌లో 105 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే జస్ప్రిత్ బుమ్రా (34 నాటౌట్), మహ్మద్ షమీ (56 నాటౌట్) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో భారత్ తొలి సెషన్ పూర్తయ్యేసరికి 186/8తో నిలిచింది. ఇక రెండో సెషన్ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.
అంతకుముందు మ్యాచ్ ప్రారంభమయ్యక జట్టును ఆదుకుంటాడని భావించిన యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (22; 46 బంతుల్లో 1×4) త్వరగానే పెవిలియన్ చేరాడు. రాబిన్సన్ వేసిన 85.3వ ఓవర్‌కు కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్ శర్మ (16; 24 బంతుల్లో 2×4) కూడా రాబిన్‌సన్ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. అయితే, ఎనిమిదో వికెట్‌కు జోడీ కట్టిన షమీ, బుమ్రా ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. దాంతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించి ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దాంతో ఇంగ్లాండ్ ఆశలకు గండికొట్టారు.