లార్డ్స్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో రిషభ్ పంత్ (14*),ఇషాంత్ శర్మ (4*) నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లతో రాణించారు.
105/3తో టీ విరామానికి వెళ్లిన టీమ్ఇండియా చివరి సెషన్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. పుజారా- రహానె జంట నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాతి బంతికే వుడ్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో దొరికిపోయాడు పుజారా. మరికాసేపటికే పుజారా, జడేజాను మొయిన్ అలీ వెనక్కి పంపాడు. దీంతో 155/3తో పటిష్టంగా ఉన్న టీమ్ఇండియా 175/6కి మారిపోయింది. 82 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక చివరి రోజు తొలి సెషన్‌ను పూర్తిగా ఆడితే ఈ టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఉంటాయి.