Kohli sledges Bairstow: మైదానంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది ఆటలో అయినా ఇతర ప్లేయర్స్‌ను కవ్వించే విషయంలోనైనా. అయితే గత కొంతకాలంగా పరుగులు చేయక ఇబ్బంది పడుతున్న అతడు.. తాజాగా మరోసారి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టోకు ఝలక్ ఇచ్చాడు. ఐదో మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆటలో 31.1 ఓవర్లో జరిగిందీ సంఘటన.
కోహ్లీ స్లెడ్జింగ్.. బెయిర్ స్టోతో వాగ్వాదం - కోహ్లీ స్లెడ్జింగ్ బెయిర్ స్టో
Kohli sledges Bairstow: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. బెయిర్‌స్టోతో వాగ్వివాదానికి దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇబ్బందిగా ఆడుతూ కనిపించాడు. దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ తన నోటికి పని చెప్పాడు. 'నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.., సౌథీ కన్నా వేగంగా బంతులు వేస్తున్నాడు కదా?' అంటూ వెటకారంగా స్టోను రెచ్చగొట్టాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. అలా ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగగా.. అంపైర్ వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశాడు. ఆ తర్వాత స్టోని నవ్వుతూ భుజం తట్టి ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు విరాట్. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ సంఘటన తర్వాత స్టో ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన అతడు, ఆ తర్వాత 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ప్రస్తుతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
ఇదీ చూడండి: జడ్డూ ఈజ్ బ్యాక్.. అతడు జట్టును ఆదుకున్న మ్యాచ్‌లివే!