కరోనా కారణంగా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ఇండియా వరుస అవాంతరాలను ఎదుర్కొంటోంది. యువ వికెట్‌కీపర్- బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ వైరస్ బారిన పడగా, సహాయ సిబ్బందిలో పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా మరో కీపర్ వృద్ధిమాన్ సాహా ఐసోలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరూ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకపోతే ఇక కీపర్‌గా మిగిలింది కేఎల్ రాహుల్ మాత్రమే.
ఐసోలేషన్‌లో పంత్, సాహా.. డీకే ఆసక్తికర ట్వీట్ - దినేశ్ కార్తీక్
ఇంగ్లాండ్ పర్యటన వేళ కొవిడ్ కారణంగా ఇద్దరు టీమ్ఇండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.
రిషభ్ పంత్
ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు దినేశ్ కార్తీక్. ప్రసార సిబ్బందిలో(కామెంటేటర్) భాగంగా ఇంగ్లాండ్‌లోనే ఉన్న తను.. ఓ అవకాశం ఇస్తే కీపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతమిచ్చాడు. అందుకు సూచనగా తన గ్లోవ్స్‌తో పాటు క్రికెట్ కిట్‌ను ట్విట్టర్లో షేర్ చేశాడు. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఇదీ చూడండి:Rishabh Pant: పంత్‌ను వెనకేసుకొచ్చిన దాదా