నాటింగ్హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా వికెట్ నష్టపోయి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (12), పుజారా (12) క్రీజులో ఉన్నారు. విజయానికి 157 పరుగుల దూరంలో నిలిచింది కోహ్లీ సేన.
Ind vs Eng: టీమ్ఇండియా ముందు మోస్తరు లక్ష్యం - ఇండియా vs ఇంగ్లాండ్ తొలి టెస్టు
నాటింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టులో విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్ఇండియా. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52/1 పరుగులు చేసింది.
ఇండియా vs ఇంగ్లాండ్
అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రూట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సామ్ కరన్, బెయిర్ స్టో దూకుడుగా ఆడారు.
ఇదీ చూడండి:జడేజా ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో 5వ స్థానం