టీమ్‌ఇండియా వన్డేల్లో ఆరోసారి 400 మార్క్‌ను దాటింది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఈ ఘనత సాధించింది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (210), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113) అదరగొట్టేయగా.. వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించారు. శిఖర్ ధావన్ (3), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 2, షకిబ్ 2, ఎబాడట్ 2.. ముస్తాఫిజర్, మెహిదీ చెరొక వికెట్ తీశారు. బంగ్లాదేశ్‌పై ఇదే భారత్‌కు అత్యధిక స్కోరు. అంతకుముందు 370/4 స్కోరే అత్యధికం.
IND VS: ఆరోసారి 400+.. బంగ్లా లక్ష్యం ఎంతంటే? - bangladesh match kohli century
మూడో వన్డేలో టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌కు భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్డేల్లో ఆరోసారి 400 ప్లస్ మార్క్‌ను దాటింది. ఇషాన్ కిషన్(210), కోహ్లీ(113) అదరగొట్టేశారు.
IND VS: ఆరోసారి 400+.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?