Ind Vs Ban World Cup 2023 :వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. పుణె వేదికగా జరగుతున్న ఈ పోరులో టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. నిర్దిష్ట ఓవర్లకు 256 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా, సిరాజ్ లాంటి బౌలర్లు తమ ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా బంతులను సంధించి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు.
Virat Kohli Bowling : ఇక ఇదే మ్యాచ్ వేదికగా టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బౌలర్ అవతారమెత్తాడు. అయితే, కేవలం మూడు బంతులను మాత్రమే విసిరాడు. ఇన్నింగ్స్‌లోని 9వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తీసుకున్నా సరే బౌలింగ్ వేయడానికి అతడు ఇబ్బంది పడ్డాడు. మోకాలి నొప్పితో బాధపడుతూ డగౌట్‌కు చేరిపోయాడు. దీంతో ఆ ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీతో కెప్టెన్ రోహిత్ శర్మ వేయించాడు. అలా బౌలింగ్ చేసిన విరాట్.. కేవలం రెండు సింగిల్స్‌ను మాత్రమే ఇవ్వడం గమనార్హం. మీడియం పేస్, స్పిన్‌ను కలిపి వేసిన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్లు షాట్ కొట్టేందుకు కూడా ప్రయత్నించలేదు.
ఆరేళ్ల తర్వాత ఇలా..
Virat Kohli World Cup : గత ఆరేళ్ల తర్వాత విరాట్ తొలిసారి వన్డేల్లో బౌలింగ్ చేయడం విశేషం. చివరిగా 2017 ఆగస్ట్ 31న శ్రీలంకపై రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా ఒక ఓవర్ వేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో విరాట్ కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. అదే వరల్డ్ కప్‌లో ఆసీస్‌పై ఒక ఓవర్ వేసి 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో ఆసీస్‌పైనే ఒక ఓవర్ బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు మూడు బంతుల్లో కేవలం 2 పరుగులతో ఓవర్‌ను ముగించాడు.