తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS BAN: హలో 'రాహుల్స్​' ఎందుకలా చేశారు.. నెటిజన్స్​ ఫుల్​ ఫైర్​ - బంగ్లాదేశ్​ రెండో టెస్ట్​ నెటిజన్స్​ ఫుల్​ ఫైర్​

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టు కోసం ఎంపిక చేసిన తుది జట్టు విషయమై నెటిజన్లు విపరీతంగా మండిపతున్నారు. ముఖ్యంగా కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, కోచ్​ రాహుల్​ తీరును విమర్శిస్తున్నారు.

Jayadev
IND VS BAN: హలో రాహుల్స్​ ఎందుకలా చేశారు.. నెటిజన్స్​ ఫుల్​ ఫైర్​

By

Published : Dec 22, 2022, 10:54 AM IST

Updated : Dec 22, 2022, 11:18 AM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు కోసం టీమ్​ఇండియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. పిచ్.. పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే జట్టులో మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఉండగా.. జయదేవ్ ఉనద్కత్‌ను బరిలోకి దించింది. దీంతో చివరిగా 2010 డిసెంబర్లో టెస్ట్ మ్యాచ్ ఆడిన జయదేవ్.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే జయదేవ్ ఉనద్కత్‌ను ఆడించడం కోసం మొదటి టెస్టులో మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచిన కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టింది.

ఈ క్రమంలోనే "పట్టుదల, కఠిన శ్రమ ఎన్నటికీ వృథా కావు.. ఈరోజు వైట్‌ జెర్సీలో జయదేవ్‌" అంటూ అతడి ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో జయదేవ్​ను ఆడించడంపై కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కుల్దీప్​ను పక్కనపెట్టడంపై మండిపడుతున్నారు.

అదనపు పేసర్ కావాలనే కారణంతో జయదేవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే జట్టులో కుల్దీప్‌తోపాటు అక్షర్ పటేల్, అశ్విన్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండగా.. మిగతా ఇద్దర్నీ కాదని.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని నెటిజన్లు నిలదీస్తున్నారు. టీమ్​ఇండియాపై మండి పడుతున్నారు. కేఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రావిడ్ తీరునూ తప్పుబడుతున్నారు.

అంతే కాదు కుల్దీప్ యాదవ్ ఇప్పట్లో మరో టెస్టు ఆడటం కష్టమే. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లోగా రవీంద్ర జడేజా ఫిట‌నెస్ సాధిస్తాడు. దీంతో జడేజాను ఆడించడానికే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మళ్లీ కుల్దీప్‌కు టెస్టు మ్యాచ్​ ఆడే అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి.

ఇదీ చూడండి:భారీగా పెరిగిన IPL విలువ.. రూ.87 వేలకోట్లకు పైగా..

Last Updated : Dec 22, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details