బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు జోరు ప్రదర్శిస్తున్నారు. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నారు. 35 ఓవర్లు ముగసేసరికి 295 పరుగలు చేశారు. ఇషాన్ కిషనైతే వీరవిహారం చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేస్తున్నాడు. కేవలం 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో ద్విశతకం సాధించాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించిన ఇషాన్.. మరో 41 బంతుల్లోనే ఇంకో శతకం పూర్తి చేయడం విశేషం.
ఈ మార్క్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు. అలానే వన్డేల్లో ద్విశతకం సాధించిన 4వ భారత క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతూ సెంచరీ బాదాడు. 86 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. అందులో 11 ఫోర్లు, ఓ సిక్స్ ఉంది. ఈ మార్క్‌తో వన్డేల్లో 44వ శతకం నమోదు చేసిన ఆడగాడిగా విరాట్ నిలిచాడు. అలాగే అతడికి ఇది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 72వ శతకం.