బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. 278 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదనంగా మరో 126 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో పుజారా(90*), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు.
IND VS BAN: టీమ్ఇండియా ఆలౌట్.. రాణించిన పుజారా, శ్రేయస్ - ind vs ban 1st test squad
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఆ వివరాలు..
టీమ్ఇండియా ఆలౌట్.. రాణించిన పుజారా, శ్రేయస్
ఆఖరిలో కుల్దీప్ యాదవ్(40) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(22), శుబ్‌మాన్ గిల్(20), విరాట్ కోహ్లి(1) తీవ్ర నిరాశపరిచారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.
ఇదీ చూడండి:కివీస్ జట్టుకు బిగ్ షాక్.. కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
Last Updated : Dec 15, 2022, 2:50 PM IST