బంగ్లాదేశ్‌తో ఆడుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమ్ఇండియా విజయానికి చేరువైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే భారత్‌దే గెలుపు. టీమ్ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసేసరికి 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం. మరి ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం క షకీబ్ అల్ హసన్(40), మెహెడి(9) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
IND VS BAN: ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి చేరువలో టీమ్ఇండియా - Zakir Hasan century news
భారత్ బౌలర్లు రాణించడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా తడబాటుకు గురైంది. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువగా వచ్చింది.
కాగా, ఈ మ్యాచ్‌తో తొలి టెస్టు ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ (100) సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ నజ్ముల్ షాంటో (67)తో కలిసి తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించాడు. అయితే భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో నజ్ముల్‌తోపాటు యాసిర్ అలీ (5) వికెట్లను పడగొట్టారు. కాసేపు లిటన్ దాస్ (19), ముష్ఫికర్ (23) ఆదుకొనే ప్రయత్నం చేసినా టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు పెవిలియన్‌కు చేరారు. నరుల్ హసన్ (3) ఘోరంగా విఫలమయ్యాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. ఉమేశ్, కుల్‌దీప్, అశ్విన్ తలో వికెట్ తీశారు.