చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంతోని టీమ్ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాపై విజయం సాధించడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్.. విదేశాల్లో మూడో ఫార్మాట్లలో టీమ్ఇండియాను గెలిపించిన ఐదో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.
బంగ్లాపై విజయం.. కెప్టెన్‌గా రాహుల్ అరుదైన రికార్డు.. రోహిత్‌కు సాధ్యం కాని దాన్ని.. - కేఎల్ రాహుల్ వార్తుల
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమ్ఇండియా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు రాహల్ కెప్టెన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేంటంటే?
గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే మాత్రమే టీ20, వన్డే, టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై టీమ్ఇండియాను విజయపథంలో నడిపించారు. టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని ఈ రికార్డును రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన రాహుల్, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘాన్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో విజయం సాధించడంతో విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియాను గెలిపించిన దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.
మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో టీమ్ఇండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు కూడా సారధ్యం వహించలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్లో, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లో ఐదో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ గాయాల కారణంగా దూరంగా ఉన్నాడు.