Ind vs Aus World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరు పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై చెపాక్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా అనుకున్నట్లుగానే టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులో స్థానంలో సంపాదించాడు.
తుది జట్లు..
భారత్..రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్, జడేజా, అశ్విన్, సిరాజ్
అస్ట్రేలియా..డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హజెల్‌వుడ్, ఆడమ్ జంపా,
మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్లో.. ఏ ఆటగాడు కూడా వ్యక్తిగత రికార్డుల కోసం ప్రాధాన్యం ఇవ్వకూడని సూచించాడు. మైలురాళ్లు కోసం మెగాటోర్నీ వేదిక కాదని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తూ.. జట్టులో హార్దిక్ పాండ్య లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండగా.. అదనంగా మరో స్పిన్నర్‌ను ఆడించేందుకు వీలుంటుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.