Ind vs Aus World Cup 2023 : 2023 ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించింది టీమ్‌ఇండియా. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి రెండు ఓవర్లలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని నిలకడగా ఆడింది. మూడో ఓవర్లలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు కోహ్లీ - కేఎల్ రాహుల్ కలిసి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు.
Kohli - Kl Rahul Ind VS Aus : 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ ఇండియా. బ్యాటింగ్‌కు దిగగానే రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమ్‌ఇండియా. అప్పుడు కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (97*; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకుని జట్టును విజయం దిశగా నడిపించారు. మూడు వికెట్లు పడిన తర్వాత వచ్చిన కోహ్లీ, రాహుల్ ఆచితూచి ఆడారు. సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.