తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ (T20 world cup 2021) సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమ్‌ఇండియా మరో ప్రాక్టీస్ సమరానికి సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 20) తన రెండో, చివరి సన్నాహక పోరులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ, బుమ్రా, షమీ విశ్రాంతి తీసుకున్నారు. రోహిత్ కెప్టెన్సీ చేస్తున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. కెప్టెన్‌గా రోహిత్ - భారత్-ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు (అక్టోబర్ 20) ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది బారత్. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్
అసలు టోర్నీకి ముందు తన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ చెప్పినట్లు.. రాహుల్, రోహిత్, మూడో స్థానంలో కెప్టెన్‌తో భారత్ టాప్-3 స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి. ఇంగ్లాండ్‌పై ధనాధన్ బ్యాటింగ్‌తో 70 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ప్రపంచకప్ తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్.. సూర్యకుమార్ యాదవ్ కన్నా ముందొచ్చాడు. ఆస్ట్రేలియాపై ఏ స్థానంలో ఆడతాడో చూడాలి.