టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా జోరు చూపించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన పోరులో గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు నేడు (అక్టోబర్ 20) ఆస్ట్రేలియాపైనా విజయం సాధించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి ఆసీస్‌పై గొప్ప విజయం సాధించారు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ విజయాలతో అసలు పోరును ఘనంగా ఆరంభించేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా.
వార్మప్ మ్యాచ్‌లో భారత్ దూకుడు.. ఆసీస్‌పై విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆసీస్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించి అసలు పోరుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం 153 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు శుభారంభాన్నిచ్చారు ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. రాహుల్ ధాటిగా ఆడగా.. అతడికి మద్దతుగా నిలిచాడు హిట్‌మ్యాన్. 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 39 పరుగులు చేసిన రాహుల్‌ను అగర్ పెవిలియన్ పంపాడు. తర్వాత జోరు పెంచిన రోహిత్.. తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 పరుగులు చేశాక మరొకరికి బ్యాటింగ్ ఇచ్చేందుకు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సూర్యకుమార్ (38), హార్దిక్ (14) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో స్మిత్ (57) అర్ధశతకంతో రాణించగా.. స్టోయినిస్ (41), మ్యాక్స్‌వెల్ (37) ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్, జడేజా, రాహుల్ చాహర్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు