తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్ x భారత్ తొలి టీ20 - విశాఖలో విజయం ఎవరిదో? - టీ20 టీమ్ఇండియా జట్టు

Ind vs Aus T20 : ప్రపంచకప్​ ముగిసిన నాలుగు రోజులకే.. క్రికెట్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. టీ20 సిరీస్​లో భాగంగా నవంబర్ 23న విశాఖలో భారత్ - ఆస్ట్రేలియా తొలి మ్యాచ్​లో తలపడనున్నాయి.

ind vs Aus T20
ind vs Aus T20

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 7:01 AM IST

Updated : Nov 23, 2023, 8:48 AM IST

Ind vs Aus T20 : వన్డే వరల్డ్​కప్ ఓటమి తర్వాత.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. 5 మ్యాచ్​ల సిరీస్, నేడు (నవంబర్ 23) విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో కుర్రాళ్లతో కూడిన టీమ్ఇండియా.. 2024 టీ20 వరల్డ్​కప్​కు ముందు అసలైన సవాల్ ఎదుర్కోనుంది.

టీ20 వరల్డ్​ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్.. ఇప్పుడు కెప్టెన్​గానూ నిరుపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా ముగిసిన ప్రపంచకప్​లో అంతగా ప్రభావం చూపని సూర్య.. టీ20ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సూర్యతో పాటు వరల్డ్​కప్​లో ఆడిన ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్​కు ఎంపికయ్యారు. మెగాటోర్నీలో ఇషాన్.. రెండు మ్యాచ్​ల్లో ఆడగా.. ప్రసిద్ధ్​కు ఆ ఛాన్స్​ కూడా రాలేదు. ఇక చివరి రెండు టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.

ఈ మ్యాచ్​లో ఎలాంటి జట్టుతో టీమ్ఇండియా బరిలోకి దిగనుందోనని ఆసక్తి రేపుతోంది. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్​గా ఎలాగు జట్టులో ఉంటాడు. మరి యశస్వితో కలిసి ఇన్నింగ్స్​ ఓపెనింగ్‌ చేసేదెవరు? ఓపెనింగ్​కు ఇషాన్ వస్తాడా? లేదా వైస్‌ కెప్టెన్‌ రుతురాజ్‌.. యశస్వితో జతకడతాడా? అనేది ప్రశ్న.

కెప్టెన్‌ సూర్య వన్​డౌన్​లో రావచ్చు. ఇక నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో వరుసగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌ ఆడే ఛాన్స్​ ఉంది. బౌలింగ్​లో ముకేశ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌కు చోటు దక్కవచ్చు. ఒకవేళ అక్షర్ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు.

మరిన్ని విషయాలు

  • ఆస్ట్రేలియా విశాఖ స్టేడియంలో ఇప్పటివరకు 5 అంతర్జాతీయ మ్యాచ్​ల ఆడింది. అందులో 4 మ్యాచ్​ల్లో గెలిచి ఒకదాంట్లో ఓడింది.
  • భారత్ - ఆస్ట్రేలియా మధ్య 26 టీ20 మ్యాచ్​లు జరిగాయి. అందులో భారత్ 15 , ఆస్ట్రేలియా 10 మ్యాచ్​ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్​లో ఫలితం తేలలేదు.

తుది జట్టు (అంచనా)..
భారత్‌ :ఇషాన్‌ (వికెట్‌కీపర్‌), యశస్వి, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, అక్షర్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌/అవేష్‌, ముకేశ్‌.

ఫస్ట్​ ప్లేస్​​పై కోహ్లి కన్ను - వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్ ఏ​ పొజిషన్​లో ఉన్నాడంటే?

భారత్​తో అఫ్గాన్​ తొలి ద్వైపాక్షిక సిరీస్​- టీమ్ఇండియా నెక్స్ట్​ టార్గెట్ అదే!

Last Updated : Nov 23, 2023, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details