తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Aus ODI 2023 : ఆసీస్​తో మ్యాచ్​కు అంతా రెడీ.. ఈ సిరీస్​ వారికి అగ్ని పరీక్ష! - ind vs aus odi 2023 venue

Ind vs Aus ODI 2023 : భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ శుక్రవారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్​ టీమ్ఇండియాలోని కొందరు ఆటగాళ్లకు కీలకం కానుంది. అది ఎవరంటే!

Ind vs Aus ODI 2023
Ind vs Aus ODI 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 3:58 PM IST

Ind vs Aus ODI 2023 : ప్రపంచంలో మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో.. భారత్ ప్రపంచకప్​ కంటే ముందు మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ శుక్రవారం ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్​లో తొలి రెండు వన్డే మ్యాచ్​లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు మేనేజ్​మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో ఈ మ్యాచ్​ల్లో జట్టుకు కేఎల్ రాహుల్‌ నాయకత్వం వహిస్తాడు. అయితే మెగాటోర్నీ కంటే ముందు.. ప్లేయర్ల విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఓ అంచనాకు రావడానికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది.

ఛాన్స్ ఎవరికో.. సెప్టెంబర్ 28 వరకు ప్రపంచకప్​స్క్వాడ్​లో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ వీలు కల్పించింది. ఆయితే ఈ సిరీస్​కు ఎంపికైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాటర్ తిలక్ వర్మ, ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​కు.. మెగాటోర్నీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్​ ఉంది. ఎలాగంటే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ గాయాల నుంచి ఇంకా కోలుకున్నట్లు లేరు. కానీ వీరిద్దరూ ప్రపంచకప్​ స్క్వాడ్​లో ఉన్నారు. ఒకవేళ వీరు సెప్టెంబర్ 28 లోపు పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోకపోతే.. వరల్డ్‌ కప్‌కు దాదాపు దూరమైనట్లే. దీంతో ప్రతిభ ఆధారంగా ఈ ముగ్గురిలో మేనేజ్​మెంట్ ఎవరో ఇద్దరి వైరు మొగ్గు చూపవచ్చు.

తుదిజట్టు ఎలా ఉండనుంది..ఆసీస్​తో మొదటి మ్యాచ్​లో ఎవరిని బరిలోకి దింపాలన్నది మేనేజ్​మెంట్ సవాలే. ఆసియా క్రీడల్లో భారత్​కు కెప్టెన్​గా ఎంపికైన రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ రుతురాజ్‌ తుది జట్టులో ఉండేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. అయినప్పటికీ జట్టుతోపాటు ఉండటం వల్ల.. అతడికి ఈ అనుభవం ఆసియా గేమ్స్‌లో ఉపయోగపడవచ్చు. ఇక శుభ్​మన్ గిల్​తో పాటు ఇషాన్ కిషన్​ ఇన్నింగ్స్​ ప్రారంభించే అవకాశాలున్నాయి. వన్​ డౌన్​లో కెప్టెన్ రాహుల్ వచ్చినా.. నాలుగో స్థానంలో అయ్యర్ లేదా తిలక్ ఆడవచ్చు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఎప్పటిలాగే మిడిలార్డర్​లోనే ఉండనున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కావాలనుకుంటే.. జడేజా, సుందర్‌, అశ్విన్‌ ఉంటారు. ఇక పేస్​ విభాగాన్ని బుమ్రా, సిరాజ్‌, షమీ చూసుకుంటారు.

మ్యాచ్​ ఎప్పుడు.. ఎక్కడ?సెప్టెంబర్ 22 శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ పోరుకు మొహాలీ స్టేడియం వేదికకానుంది. ఇక స్పోర్ట్స్‌ 18 ఛానల్​తోపాటు జియో సినిమా ఓటీటీలో లైవ్​ చూడొచ్చు.

తుది జట్టు (అంచనా) :

భారత్.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, శ్రేయస్/తిలక్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్.

KL Rahul Australia Series : ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రాహుల్ కెప్టెన్సీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Tilak Varma World Cup 2023 : హోల్డ్ ఆన్.. మనోడు ఇంకా ప్రపంచకప్​ రేసులోనే.. సమీకరణాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details