టీమ్ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా ఫీల్డింగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదిరిపోయే స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. రెండో ఓవర్లోనే మహ్మద్ సిరాజ్ కీలక వికెట్ తీశాడు. మంచి ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్(5)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(22), మిచెల్ మార్ష్ (81) ఇద్దరూ ఇన్నింగ్స్ మంచిగా ఆడారు. స్మిత్ ఔటైన తర్వాత వచ్చిన లబుషేన్(15) కూడా బాగా ఆడాడు.
అలా లబుషేన్, మార్ష్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తమపై వేసుకుంది. అయితే ఈ జోడీని జడేజా విడగొట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మార్ష్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు దిగాడు. అతడు వేసిన బంతిని వెనకడుగు వేసి కట్ చేసేందుకు ప్రయత్నించాడు లబుషేన్. కానీ చేతులు ఫ్రీగా కదిలించేంత స్పేస్ లేకపోవడం వల్ల కాస్త తడబడ్డాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి షార్ట్ థర్డ్‌లో ఉన్న జడేజా కుడివైపుగా దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే జడ్డూ తనవైపు వచ్చిన బాల్‌ను.. చిరుతలా దూకి.. బంతి నేలను తాకడానికి సెంటీమీటరు దూరంలో ఉండగా రెండు చేతులతో ఒడిసి పట్టేశాడు. అతడు ఈ క్యాచ్ పట్టిన చూసిన కుల్దీప్ యాదవ్ సహా టీమ్ఇండియా అంతా షాక్ అయింది. ఆడియెన్స్ కూడా జడ్డూ ఫీల్డింగ్‌కు షాకయ్యారు.
శుబమన్ గిల్ సూపర్ క్యాచ్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ కూడా.. స్లీప్‌లో సంచలన క్యాచ్‌లతో అందరిని దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా రెండు అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో గిల్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. స్లిప్‌లో క్యాచ్‌లను ఎలా అందుకోవాలన్న మెళకువలను నేర్పించాడు. అలా ఈ మ్యాచ్‌లో గిల్.. స్లిప్‌లో సూపర్ క్యాచ్‌ను అందుకోవడంతో ద్రవిడ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది.
షమీ నిప్పులు..ఇక ఈ మ్యాచ్‌లో మరో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ కూడా నిప్పులు చెరిగాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌లో రెండు మెయిడెన్లు ఉండడం విశేషం. అతడు తీసిన మూడు వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా కంగారు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను షమీ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. అతడు గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 30 ఓవర్‌లో మూడో బంతిని ఫుల్లర్ లెంగ్త్ డెలివరిగా షమీ వేశాడు. దాన్ని గ్రీన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. ఆ బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇదీ చూడండి:IPL 2023: దిల్లీ ఫ్రాంఛైజీకి షాక్.. రూ.22 కోట్లు లాస్.. మరి నీతా అంబానీకి ఎంతంటే?