తెలంగాణ

telangana

ETV Bharat / sports

2001 టెస్ట్​ మ్యాజిక్​ రిపీట్​ అవుతుందా?.. అప్పుడు కూడా సేమ్​ సీన్​! - ట్రావిస్ హెడ్ సెంచరీ

WTC Final 2023 మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. రెండు రోజు పుంజుకోకపోతే టీమ్​ఇండియా మ్యాచ్​ను కాపాడుకోవడం కష్టమే. అయితే ఇక్కడ అభిమానులు 2001 టెస్ట్​ మ్యాచ్​ను గుర్తుచేసుకుంటున్నారు. ఆ మ్యాజిక్ రిపీట్​ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ వివరాలు..

will india repeat the 2001 chennai test magic in wtc final 2003 against australia
2001 టెస్ట్​ మ్యాజిక్​ రిపీట్​ అవుతుందా?.. అప్పుడు కూడా సేమ్​ సీన్​!

By

Published : Jun 8, 2023, 11:01 AM IST

WTC Final 2023 IND VS AUS : డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం సాధించింది. ఆరంభంలోనే భారత పేసర్ల దాటికి.. ఆసీస్ 76 పరుగులతో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని చెలరేగింది. పిచ్​ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల.. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146; 22×4, 1×6) , స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95; 14×4) ఆసీస్‌ను ఆధిక్యంలో నిలిపారు. దీంతో 327/3 వద్ద మొదటి రోజు ఆటను ముగించిన ఆస్ట్రేలియా.. ప్రస్తుతం పటిష్టమైన స్థితిలో ఉంది. అయితే ఈ ఆటను చూశాక.. టీమ్​ఇండియా రెండో రోజు ఆటలో చెలరేగకపోతే కష్టమే అని ఓ అంచనాకు వచ్చేశారు. ముఖ్యంగా బౌలర్లు.. ఫస్ట్​ ఇన్నింగ్స్​లో వీలైనంత త్వరగా వికెట్లను కూల్చి ఆసీస్​ బ్యాటర్లను కట్టడి చేయాలని అంటున్నారు.

సేమ్​ స్కోరు.. హిస్టరీ రిపీట్​ అవుతుందా?.. అయితే 2001లో చెన్నై వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టులో కూడా ఫస్ట్​ డే దాదాపు ఇలాంటి స్కోరే నమోదైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. ఆస్ట్రేలియా 326/3తో నిలిచింది. కానీ రెండో రోజు ఆటలో భారత బౌలర్లు పుంజుకుని 391 పరుగులకు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు. అనంతరం టీమ్ఇండియా తమ ఫస్ట్​ ఇన్నింగ్స్‌లో 501 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్​ను 264 పరుగులకు కుప్పకూల్చింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో 155/8తో నిలిచి రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అయితే బాగుండు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ind vs Aus chennai test 2001 : అయితే ఇక్కడ విషయమేమిటంటే 2001లో ఆడిన చెన్నై పిచ్.. స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. దీనిపై భారత్​కు మంచి అవగాహన ఉంది. అవలీలగా ఈ పిచ్​పై అడేస్తుంది. అందుకే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రెండో రోజు ఆటలో మాజీ ప్లేయర్​ హర్భజన్ సింగ్ బంతితో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఓవల్‌లో అలా టీమ్​ఇండియాను ఆదుకునే బౌలర్ ఎవరు? అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

2001 టెస్ట్​ మ్యాజిక్​ రిపీట్​ అవుతుందా?

WTC final pitch : ప్రస్తుతం మన బౌలర్లు రెండో రోజు ఆటలో తమ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తే.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో అవలీలగా 550కుపైగా పరుగుల వరకు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేలా ఉందని.. భారత్‌కు ఇక కష్టమే అని అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం.. 2001 సీన్​ రిపీట్ అవుతుందేమో చూద్దాం అనే ఆశాభావంతో ఉన్నారు. చూడాలి మరి భారత బౌలర్లు ఎలా రాణిస్తారో? ఏం జరుగుతుందో?..

ఇదీ చూడండి :

WTC Final 2023 : తొలి రోజు పాయే.. ఇక రెండో రోజు అలా చేస్తేనే..

WTC Final AUS vs IND : ఫస్ట్​ డే హైలైట్​ ఫొటోస్​ మీకోసం..

ABOUT THE AUTHOR

...view details