Ind vs Aus 5th T20 : ఆఖరి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నిర్దేశించిన టార్గెట్ చిన్నదే అయినా టీమ్ఇండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. దీంతో భారత్ 6 పరుగులు తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 160 పరగులు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఛేదనలో .. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. ఈ విజయంతో సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్.
స్వల్ప టార్గెట్ అయినా ఆసీస్ మొదటి నుంచి తడబడింది. ఫిలిప్ (4)ను బౌల్డ్ చేయడం ద్వారా కంగారూల పతనాన్ని ముకేశ్ త్వరగానే ఆరంభించాడు. అయినా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28; 18 బంతుల్లో 5×4, 1×6) అలవాటైన రీతిలో ధాటిగా ఆడాడు. దీంతో ఆసీస్ అయిదో ఓవర్లో 47/1తో నిలిచింది. బెన్ జార్మెట్ (54 పరుగులు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ (22 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఇక మిగతా వారెవరు పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. టీమ్ఇండియా బౌలర్ రవి బిష్ణోయ్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుకు ఎంపికయ్యాడు.