Ind Vs Aus 3rd ODI 2023 :ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు కీలక సమయంలో భారత ప్లేయర్స్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఈ చివరి మ్యాచ్‌నూ కూడా గెలిస్తే టీమ్‌ఇండియా ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరుతుంది.
అరుదైన ఘనత..మొదటి సారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్.. టీమ్ ఇండియా ముంగిట ఉంది. ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కొన్నింటిలో టీమ్‌ఇండియా విజయం సాధించినా.. క్లీన్‌స్వీప్ మాత్రం చేయలేకోపోయింది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో గెలిస్తే... క్రికెట్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా భారత చరిత్ర సృష్టించే అవకాశం దక్కుతుంది. ప్రపంచకప్ బరిలోకి దిగే ముందు ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేస్తే భారత ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పైగా వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్‌ను (అక్టోబర్ 8న) ఆసీస్‌తోనే ఆడనుంది.
ఓపెనింగ్ ఎవరు? మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మతో ఓపెనింగ్ ఇషాన్ కిషన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉంటారు. అయితే బౌలింగ్ విభాగంపై ఆసక్తి నెలకొంది. తుది జట్టులో ఎవరు ఉంటారనేది? ఎందుకంటే రాజ్‌కోట్ వేదిక బ్యాటింగ్‌కు అనుకూలం. ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే.. జడేజాతో పాటు మరోసారి అశ్విన్‌ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అశ్విన్‌కు పరీక్ష పెట్టినట్లు అవుతుంది. పేస్ బాధ్యతలు బుమ్రా, సిరాజ్ చూసుకుంటారు.