Ind vs Aus 1st ODI 2023 :మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో.. భారత్ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రత్యర్థి ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్(71 పరుగులు) అర్ధసెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత కెప్టెన్ రాహుల్ (58*), సూర్యకుమార్ యాదవ్ (50 పరుగులు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు వికెట్లతో రాణించిన భారత బౌలర్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్.. వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దీంతో టీమ్ఇండియా.. ప్రస్తుతం మూడు ఫార్మట్లలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఆరంభం అదిరెన్.. 277 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు గిల్, రుతురాజ్ తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు జట్టు రన్‌రేట్ 6కు తగ్గకుండా చూసుకున్నారు. ప్రత్యర్థి జట్లు బౌలర్లనే ఆత్మ రక్షణలో పడేసి.. ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ వన్డే కెరీర్లో తొలి అర్ధ శతకం సాధించాడు.
మరోవైపు గిల్.. కెరీర్లో తొమ్మిదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో 21.4 ఓవర్ వద్ద.. అడమ్ జంపా రుతురాజ్‌ను ఎల్బీడబ్ల్యూగా పెలివియన్ చేర్చాడు. అనంతరం వన్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3).. తొందరపాటులో రనౌట్ అయ్యాడు. ఇక సెంచరీ దిశగా వెళ్తున్న గిల్ కూడా కొంతసేపటికే ఔటయ్యాడు.