IND Vs AFG T20 : పంజాబ్‌లోని మొహాలీ వేదికగా భారత్, ఆఫ్గానిస్థాన్ టీ20 పోరు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం ఇప్పటికే 16 మంది ఆటగాళ్లతో కూడిన ఓ భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే అందులో రానున్న మ్యాచులకు ఏ 11 మంది ఆటగాళ్లను మ్యాచ్‌లో ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆ ప్లేయర్స్ ఎవరంటే ?
ఈ టీ20తో ఈ ఫార్మాట్లోకి మళ్లీ తిరిగొచ్చిన రోహిత్ అటు జట్టుకు సారధ్య బాధ్యతలు వహించడంతో పాటు ఇటు ఓపెనర్‌గానూ ఆడతాడు. అయితే అతడితో కలిసి సమర్థవంతంగా ఇన్నింగ్స్ ఆరంభించేందుకు మరో ప్లేయర్ కావాలి. ఇప్పటికే ఈ రేసులో యంగ్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో శుభ్‌మన్, యశస్వి ఓపెనర్లుగా ఆడారు. కానీ ఇప్పుడు రోహిత్ రాకతో మరో ఓపెనర్‌గా వీళ్లిద్దరిలో ఒక్కరే తుది జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. ఇటీవలి పర్ఫామెన్స్‌ను యశస్వినే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. చివరగా ఆడిన టీ20లోనూ (దక్షిణాఫ్రికాతో)లో అతడు 41 బంతుల్లోనే 60 పరుగులు స్కోర్ చేశాడు.
మరోవైపు రోహిత్‌తో కలిసి వన్డేల్లో జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్న శుభ్‌మన్ టీ20ల్లో మాత్రం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు 15.71 సగటుతో 110 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రకంగా చూస్తే యశస్వికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. పైగా అతను ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం వల్ల జట్టుకు కలిసొచ్చే అంశంగా మారనుంది. అయితే రోహిత్, గిల్ మధ్య మంచి సమన్వయం ఉంది కాబట్టి మరోసారి ఈ జోడీ ఓపెనింగ్ చేసే అవకాశాలను కూడా ఏ మాత్రం కొట్టిపారేయలేం.