Ind vs Afg 3rd T20:బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండో సూపర్‌లో నెగ్గింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుతంగా పోరాాడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ కూడా 20 ఓవర్లకు 212 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అయితే తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16-1 పరుగులు చేయగా, టీమ్ఇండియా కూడా 16-1తో నిలిచింది. దీంతో మరోసారి డ్రా అవ్వడం వల్ల రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 11-2 పరుగులు చేసింది. అనంతరం అఫ్గాన్ 1 పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయి, ఓటమి పాలైంది. దీంతో టీమ్ఇండియా మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
తొలి సూపర్ ఓవర్ సాగిందిలా
అఫ్గాన్ బ్యాటింగ్ 16-1 (బౌలర్ ముకేశ్ కుమార్)
- తొలి బంతి- సింగిల్+ రనౌట్
- రెండో బంతి- సింగిల్
- మూడో బంతి- ఫోర్ (4)
- నాలుగో బంతి- సింగిల్
- ఐదో బంతి- సిక్స్ (6)
- ఆరో బంతి- త్రీడీ (3)
భారత్ బ్యాటింగ్ 16-1 (బౌలర్ ఓమర్జాయ్)
- తొలి బంతి- సింగిల్
- రెండో బంతి- సింగిల్
- మూడో బంతి- సిక్స్ (6)
- నాలుగో బంతి- సిక్స్ (6)
- ఐదో బంతి- సింగిల్
- ఆరో బంతి- సింగిల్
రెండో సూపర్ ఓవర్ సాగిందిలా