తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రాక్టీస్​లో కోహ్లీ.. పిల్లితో సరదాగా కాసేపు! - విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పిల్లి

ఇటీవల న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​కు దూరంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. త్వరలో కివీస్​తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్​కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ షురూ చేశాడు విరాట్. అయితే ఈ సమయంలో అతడు ఓ పిల్లితో దిగిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్​గా మారింది.

పిల్లితో విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్, virat kohli cat, kohli in practice
Kohli

By

Published : Nov 23, 2021, 9:16 PM IST

విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తాజాగా ఓ పిల్లితో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నాడు. మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. 'కూల్‌ క్యాట్‌' ఆకస్మిక తనిఖీతో ఆశ్చర్యపరిచిందని రాసుకొచ్చాడు. ఆ ఫొటోలు చూసి ముగ్దురాలైన విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ 'హలో బిల్లీ' అని పలకరించింది. దానికి సమాధానంగా 'దిల్లీ అబ్బాయితో.. ముంబయి పిల్లి' అని కోహ్లీ కామెంట్‌ చేశాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే జట్టుతో నవంబరు 25 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో కూడా కోహ్లీ ఆడటం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

కాగా, టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడం వల్ల.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. డిసెంబరు 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు.

ఇవీ చూడండి: భారత ఆటగాళ్లకు హలాల్ మాంసం.. చిక్కుల్లో బీసీసీఐ!

ABOUT THE AUTHOR

...view details