ఏకైక, అతి ముఖ్యమైన మ్యాచ్ల వేదికగా రాబోయే రోజుల్లో యూకేను ఎంపిక చేయొద్దని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) అభిప్రాయపడ్డాడు. లండన్లో వాతవరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలీదని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(WTC final) మ్యాచ్యే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నాడు.
ఇండియా-న్యూజిలాండ్(India Newzeland WTC final) మధ్య జరుగుతోన్న ఈ మ్యాచ్లో.. ఇప్పటికే రెండు రోజుల ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగు రోజుల ఆటలో 360 ఓవర్లకు గానూ కేవలం 140 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
"ఇలా చెప్పడానికి బాధగా ఉంది. కానీ, ఏకైక, ప్రాముఖ్యత కలిగిన క్రికెట్ మ్యాచ్లకు వేదికగా యూకేను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయొద్దు. డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి ఏకైక మ్యాచ్ ఉన్న టోర్నీలను దుబాయ్ వేదికగా నిర్వహించడం సరైన పని. అక్కడైతే తటస్థ వేదిక. మంచి స్టేడియం. వాతవరణంతో ఇబ్బంది ఉండదు. మంచి శిక్షణ సదుపాయాలు. ప్రయాణాలకు కూడా వీలుగా ఉంటుంది."