టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. తనను విమర్శించిన నెటిజన్లకు గట్టి సమాధానమిచ్చాడు. తన భార్యకు తాను భర్తను మాత్రమేనని.. మాస్టర్‌ను కాదని బదులిచ్చాడు.
ఏం జరిగిందంటే?
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. తనను విమర్శించిన నెటిజన్లకు గట్టి సమాధానమిచ్చాడు. తన భార్యకు తాను భర్తను మాత్రమేనని.. మాస్టర్‌ను కాదని బదులిచ్చాడు.
ఏం జరిగిందంటే?
ఇర్ఫాన్ భార్య.. సోషల్‌మీడియాలో తన కొడుకు ఖాతా ద్వారా ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో తన ముఖం బ్లర్ చేసి ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఇర్ఫాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన అతడు.. "ఈ ఫొటోను నా కొడుకు అకౌంట్ ద్వారా నా భార్య పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు చాలా వ్యతిరేకత వస్తోంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే తన ముఖాన్ని బ్లర్ చేసుకుంది. నేను తన భర్తను, మాస్టర్‌ను కాదు" అంటూ బదులిచ్చాడు.
ఇదీ చూడండి 'సెరెనాతో బ్రేక్‌ఫాస్ట్ చేయడమంటే ఇష్టం'