టీమ్ఇండియా మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో హంగామా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పఠాన్.. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన.. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కాగా, గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన భారత ప్లేయర్ యూసఫ్ పఠాన్‌కు షాక్ తగిలింది. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. రూథర్ పూనకం మొదలైంది. తన బ్యాట్‌తో చెలరేగిపోయాడు. రెండో బంతిని లాంగాఫ్ మీదగా 93 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు నమోదు చేశాడు. ఆ తర్వాత ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. అలా పఠాన్ వేసిన ఈ ఓవర్లో 5 సిక్స్‌లతో మొత్తం 31 సమర్పించుకున్నాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో యూసఫ్ పఠాన్ హంగామా.. వీడియో చూశారా! - ఇంటర్నేషనల్ లీగ్ టీ20 యూసఫ్ పఠాన్ వైరల్ వీడియో
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో హంగామా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో యూసఫ్ పఠాన్ సీరియస్‌గా కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో యూసఫ్ పఠాన్ హంగామా చేశాడు. మ్యాచ్ తన వల్లే ఓడిపోయామని అందరూ తన వైపు చూస్తున్నారని.. ఇది అవమానకరంగా ఉందని అన్నాడు. అనంతరం తన క్రికెట్ బ్యాగ్ పట్టుకుని సీరియస్‌గా బయటకు వెళ్లబోయాడు. దీంతో సపోర్ట్ స్టాఫ్, మిగతా ప్లేయర్లు ఆపే ప్రయత్నం చేశారు. కానీ యూసఫ్ వారి మాట వినలేదు. దీంతో ఒక్క సారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. కొద్ది సేపు తర్వాత అదంతా ప్రాంక్ అన్నట్లు స్మైల్ ఇచ్చాడు యూసఫ్ పఠాన్. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను దుబాయ్ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది.