క్రీడల్లో మహిళల పట్ల జరిగే లైంగిక వేధింపుల సంఘటనలను బయటకు చెప్పడం చాలా అరుదు. అయితే టెన్నిస్ నంబర్‌వన్ ర్యాంకర్ స్వియాటెక్ మాత్రం ధైర్యంగా బహిర్గతం చేసింది. ఆమెకు పోలాండ్ పార్లమెంటేరియన్ కేథరిన్, టెన్నిస్ మహిళా దిగ్గజం మార్టినా నవత్రిలోవా మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం టెన్నిస్ మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్. యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకొంది. అయితే స్వియాటెక్ టీనేజర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుత పోలాండ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిరోస్లా స్క్రిజిప్‌జిన్‌స్కీ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు పోలాండ్ పార్లమెంటేరియన్ కేథరిన్ కొటుల రెండు రోజుల కిందట వెల్లడించడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా స్వియాటెక్ ట్విటర్ వేదికగా స్పందించింది.