తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ ఆడకపోతే.. నేనూ ఆడను: రైనా - ధోనీ

వచ్చే ఐపీఎల్​లో​ ధోనీ ఆడకపోతే.. తాను కూడా ఆడనని సురేశ్ రైనా స్పష్టం చేశాడు. తాను రిటైర్ అయ్యేంత వరకు చైన్నై సూపర్ కింగ్స్​ జట్టులోనే కొనసాగుతానని అన్నాడు.

Suresh Raina
రైనా

By

Published : Jul 10, 2021, 5:31 AM IST

భారత మాజీ కెప్టెన్ ధోనీపై తనకున్న అభిమానాన్ని మాజీ క్రికెటర్​​ సురేశ్​ రైనా మరోసారి చాటాడు. వచ్చే ఐపీఎల్​లో ధోనీ ఆడకపోతే.. తాను కూడా ఆడనని స్పష్టం చేశాడు. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్​లో సీఎస్​కే విజయం సాధిస్తే.. 2022లోనూ ధోనీ ఆడాలని కోరతానన్నాడు.

"నాకు ఇంకా 4-5 ఏళ్లు మిగిలున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ ఉంది. నేను ఆడినంత వరకు చెన్నై జట్టులోనే ఆడతాను. వచ్చే సీజన్​లో ధోనీ భాయ్​ ఆడకపోతే.. నేను కూడా ఆడను. మేం 2008 నుంచి సీఎస్​కేలోనే ఉన్నాం" అని రైనా చెప్పాడు.

రైనా, ధోనీ 2008 నుంచి సీఎస్​కే తరఫున ఆడుతున్నారు. ఇటీవల ధోనీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేశాడు. మరోవైపు, టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ జెర్సీకి వీడ్కోలు పలకాలని మాజీ క్రికెటర్​ సాబా కరీమ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం ధోనీ మాత్రమే కాదు.. మిగతా దిగ్గజ క్రికెటర్ల జెర్సీలనూ భద్రపరచాలని సూచించారు.

ఇదీ చదవండి :'జులై 9న పుట్టిన ఆ లెజెండ్ ఎక్కడున్నాడో?'

ABOUT THE AUTHOR

...view details