సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్‌పై స్పందించాడు మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్. భారత జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై పలు సూచనలు చేశాడు. నాలుగో సీమర్‌ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తే తాను మహమ్మద్ సిరాజ్‌ను కాకుండా శార్దుల్ ఠాకుర్‌కు మద్దతిస్తానని తెలిపాడు. అలాంటప్పుడు రవీంద్ర జడేజా డగౌట్‌కే పరిమితం కాక తప్పదని పేర్కొన్నాడు. కివీస్ జట్టులో పలువురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న కారణంగా అశ్విన్ టీమ్‌లో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.
"ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా సిరాజ్‌తో పోల్చితే శార్దుల్ జట్టులో ఉండటం మేలు. అతడు బంతి నుంచి స్వింగ్ రాబట్టగలడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానూ పనికొస్తాడు. నేనైతే ఠాకుర్కే మద్దతిస్తాను. ఇక ఇషాంత్ శర్మ, బుమ్రా, షమీ.. ఎలాగూ జట్టులో ఉంటారు. నాలుగో పేసర్‌ను కనుక జట్టులో తీసుకోవాలంటే మాత్రం జడేజా డగౌట్‌కే పరిమితమవుతాడు."
-శరణ్‌దీప్ సింగ్, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్.