తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీని ఎందుకు పక్కనపెట్టకూడదు?: కపిల్​ దేవ్​ - కోహ్లీ ప్రదర్శన

Kapil dev on Kohli Form: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ప్రదర్శనపై షాకింగ్​ కామెంట్స్​ చేశాడు దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​. టీ20ల నుంచి విరాట్​ ఎందుకు పక్కన పెట్టకూడదని ప్రశ్నించాడు.

కపిల్​ దేవ్​ కోహ్లీ
kapil dev kohli

By

Published : Jul 9, 2022, 1:59 PM IST

Kapil dev on Kohli Form: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీపై షాకింగ్​ కామెంట్స్​ చేశాడు దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​. టీ20ల్లో నుంచి విరాట్​ను పక్కనపెట్టాలని సూచించాడు.

"టెస్టుల్లో ప్రపంచ నెంబర్​ 2 బౌలర్​ అశ్విన్​ను టెస్టు జట్టు నుంచి తప్పించినప్పుడు.. టీ20ల్లో ఆడే 11 మంది నుంచి కోహ్లీని బెంచ్​కే ఎందుకు పరిమితం చేయకూడదు. ప్రపంచ నెంబర్​ 2 బౌలర్​ను పక్కనపెట్టినప్పుడు.. నెంబర్​ 1 బ్యాటర్​ను కూడా వదులుకోవచ్చు. ప్రస్తుతం విరాట్​ బ్యాటింగ్​ స్థాయి మునపటిలా లేదు. అతను తన ప్రదర్శనల కారణంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ పడాలి. విరాట్​ను అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలి"అని కపిల్​ పేర్కొన్నాడు.

ఒకవేళ వెస్టిండీస్​తో జరగనున్న టీ20 సిరీస్​కు కోహ్లీకి విశ్రాంతినిస్తే.. అతడిని దూరం పెట్టినట్లే పరిగణించాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. "అనేక ఆప్షన్‌లు ఉన్నప్పుడు మీరు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశమివ్వాలి. కేవలం పేరు, ప్రఖ్యాతులను పట్టించుకోకుండా ప్రస్తుతం ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు స్థిరపడిన ఆటగాడే కావచ్చు. కానీ మీరు వరుసగా ఐదు గేమ్స్‌లో విఫలమైనప్పిటీకీ అప్పుడు కూడా ఆడే అవకాశాలుంటాయనేది దీని అర్థం కాదు" అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.

కాగా, పేలవ ఫామ్​తో ఇబ్బంది పడుతున్న కోహ్లీని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ ఏడాది అతడి ఫామ్​ మరింత పడిపోయింది. ఈ ఐపీఎల్​లో అతడు 16 ఇన్నింగ్స్​లో 115.98 సగటుతో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల జరిగిన ఎడ్జ్​బాస్టన్​ టెస్టులో 11,20 పరుగులతో విఫలమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్​ ముగిసిన తర్వాత కేవలం రెండు మ్యాచ్​లే ఆడాడు. దీంతో విరాట్​ స్థానంపై సందిగ్ధత నెలకొంది.

ఇదీ చూడండి: లండన్​ వీధుల్లో 'దాదా' చిందులు.. నైట్​పార్టీలో హంగామా

ABOUT THE AUTHOR

...view details