ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) విరాట్ కోహ్లీపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్(Axar Patel) అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ (Rohit Sharma), చెతేశ్వర్ పుజారా (Pujara), అజింక్యా రహానె (Ajinkya Rahane) వంటి సీనియర్లు ఉన్నారని తెలిపాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న రిషభ్ పంత్ కూడా ఉన్నాడని వెల్లడించాడు. విరాట్ లేనప్పటికీ ఆసీస్ సిరీస్‌లో కుర్రాళ్లు అదరగొట్టారని గుర్తుచేశాడు.
"కోహ్లీ (Virat Kohli) ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే కుర్రాళ్లు ఫామ్‌లో ఉన్నారు. విరాట్ లేకుండానే మన జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్ నెగ్గింది. ఇంగ్లాండ్ సిరీసులో అతడు త్వరగా ఔటైనా పంత్, సుందర్ అదరగొట్టారు. రోహిత్ శతకాలు బాదేశాడు. స్పిన్నర్లు కూడా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు"
-అక్షర్ పటేల్, టీమ్‌ఇండియా స్పిన్నర్.