మహిళల టీ20 క్రికెట్‌కు సంబంధించి బ్యాటింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో ర్యాంకులు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). టీమ్ఇండియా యువ సంచలనం షెఫాలీ వర్మ.. పొట్టి ఫార్మాట్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమియా రోడ్రిగ్స్ టాప్-10లో కొనసాగుతున్నారు.
షెఫాలీ అగ్రస్థానం పదిలం.. టాప్-10లోకి బ్రైస్ - బెత్ మూనీ
మహిళల టీ20 బ్యాటింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకులను ప్రకటించింది ఐసీసీ. టీమ్ఇండియా యువ బ్యాట్స్ఉమెన్ షెఫాలీ వర్మ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. స్కాట్లాండ్ ప్లేయర్ కాథరిన్ బ్రైస్ పదో స్థానాన్ని దక్కించుకుంది.
ఇదే విభాగంలో స్కాట్లాండ్ బ్యాట్స్ఉమెన్ కాథరిన్ బ్రైస్ తొలి సారి కెరీర్ అత్యుత్తమ ర్యాంకు దక్కించుకుంది. 629 పాయింట్లతో పదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆల్‌రౌండర్ విభాగంలోనూ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఐర్లాండ్‌తో 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది బ్రైస్. ఇక ఈ విభాగంలో కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ తరఫున దీప్తి శర్మ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఇదీ చదవండి:ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్... ఇప్పుడు కార్పెంటర్!